Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టర్కీ వీధుల్లో ఆమిర్ ఖాన్‌ను ఆట‌ప‌ట్టించిన ఐస్‌క్రీం విక్ర‌య‌దారుడు... వీడియో చూడండి

  • ఆశ్చ‌ర్య‌పోయిన మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ష‌నిస్ట్‌
  • ట‌ర్కీ వీధుల్లో ఆమిర్ విహారం
  • ట్వీట్ చేసిన హీరో
ఐస్‌క్రీం చూడ‌గానే ఎవ‌రికైనా నోరూరుతుంది. ట‌ర్కీ వీధుల్లో విహ‌రిస్తున్న‌పుడు ప‌క్క‌నే ఉన్న ఐస్‌క్రీం స్టాల్‌ని చూడ‌గానే బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ష‌నిస్ట్ ఆమిర్ ఖాన్‌కి అలాగే నోరూరింది. అక్క‌డికి వెళ్లి ఐస్‌క్రీం ఇమ్మ‌ని అడిగాడు. కానీ ఆ ఐస్‌క్రీం విక్ర‌య‌దారుడు ఆమిర్‌ను కాసేపు ఆట‌ప‌ట్టించాడు. ఐస్‌క్రీం ఇచ్చీఇవ్వ‌న‌ట్టుగా, ఒక‌సారి ఇచ్చి, మ‌రోసారి లాక్కొని ఇలా ర‌క‌ర‌కాల విన్యాసాలు ప్ర‌ద‌ర్శించాడు. ఒక నిమిషం పాటు నానా ఇబ్బంది పెట్టి చివ‌రికి ఆమిర్‌కి ఐస్‌క్రీంని రుచి చూపించాడు.

ఆ ఐస్‌క్రీం విక్ర‌య‌దారుడి విన్యాసాల‌కు ఆశ్చ‌ర్య‌పోయిన ఆమిర్‌...`క‌ష్ట‌ప‌డి సాధించింది చాలా తియ్య‌గా ఉంటుంది. ట‌ర్కీ ఐస్‌క్రీం చాలా బాగుంది` అంటూ ఆ విన్యాసాల‌ వీడియోను త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఐస్‌క్రీం కొన‌డానికి వ‌చ్చిన వారిని ఆట‌ప‌ట్టిస్తూ, వారి ఓపిక‌ను ప‌రీక్షించే ఇలాంటి వీడియోలు సోష‌ల్ మీడియాలో చాలానే ఉన్నాయి. కానీ అదే అనుభ‌వం మ‌న హీరోకి జరిగిన‌పుడు చూస్తుంటే భ‌లే ముచ్చ‌టేస్తోంది.
aamir khan
ice cream vendor
turkey
trickster
video
tweet
mr perfectionist

More Telugu News